నిజామాబాద్‌లో కరోనా టెస్టింగ్ మొబైల్ వ్యాన్

by  |
నిజామాబాద్‌లో కరోనా టెస్టింగ్ మొబైల్ వ్యాన్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తిరిగి కొవిడ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ టెస్టులు నిర్వహించేలా ఏర్పాటు చేసిన కొవిడ్ టెస్టింగ్ మొబైల్ వ్యాన్ ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. నగరంలో అధిక జనాభా ఉన్నందున కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదైతున్నాయని, ప్రజలు భయపడి జిల్లా ఆసుపత్రిలో చేసుకోవడము లేదన్నారు. మొబైల్ టెస్టింగ్ వాన్ లో వైద్య సిబ్బందిని, రాపిడ్ ఆంటీజన్ కిట్లు, సామాగ్రి ఏర్పాటు చేయడం చేశామన్నారు. ఈ వ్యాన్ పట్టణంలోని అన్ని ప్రాంతాలలో తిరిగి లక్షణాలు ఉన్న వారు, తొమ్మిది నెలల గర్భవతులు, 55 సంవత్సరాలు పైబడిన ప్రైమరీ కాంటాక్టు (కోవిడ్ పేషెంటుతో కాంటాక్ట్ అయ్యి 8 రోజులు దాటిన వారు) లకు వారు నివసించే ప్రాంతాలలోనే టెస్టులు చేస్తారని ఆయన తెలిపారు.

వ్యాన్ తిరిగే ప్రాంతాలలో ఆశా వార్కర్లు ఆయా ప్రాంతాల్లో టెస్ట్ చేయవలసిన వారిని గుర్తించి వారికి, వైద్యాధికారులకు సమాచారం అందించాలని, వారికి వాహన్లాలోనే రాపిడ్ టెస్ట్ లు నిర్వహించి, పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే ఐసోలేషన్ కీట్స్, అవసరమైన సూచనలు ఇచ్చి ఐసోలేషన్ కు పంపించాలన్నారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని, ఎప్పటికప్పుడు సబ్బుతో లేదా శానిటైజర్ తో చేతులు శుభ్రపరుచుకొంటూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ కమీషనర్ జితేష్ వి పాటిల్, మొబైల్ వ్యాన్ ఇన్ చార్జ్ వైద్యాధికారిణి డాక్టర్ అంజన తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed