జగిత్యాలలో స్ట్రెయిన్ కలకలం

by Anukaran |   ( Updated:2021-03-05 01:39:09.0  )
జగిత్యాలలో స్ట్రెయిన్ కలకలం
X

దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో మరోసారి బ్రిటన్ స్ట్రెయిన్ కలకలం రేపింది. బ్రిటన్ విమానాల్లో దుబాయి నుండి ఇండియా వచ్చిన ఇద్దరికి కరోనా స్ట్రెయిన్ వ్యాధి సోకినట్టుగా తెలుస్తోంది. మల్యాల మండలం ముత్యంపేటకు ఇటీవల వచ్చిన ఓ వ్యక్తికి కరోనా స్ట్రెయిన్ పాజిటివ్ నిర్దారణ అయింది. ఆ ఇంటికి చెందిన మరో ఆరుగురికి కూడా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. తాజాగా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామానికి దుబాయి నుండి వచ్చిన మరో వ్యక్తికి కరోనా స్ట్రెయిన్ నిర్దారణ అయింది. ఇద్దరిని కూడా హైదరాబాద్ టిమ్స్‌కు తరలించారు. ఫిబ్రవరి 25న ఒకరు 27న ఒకరు విదేశాల నుండి తమ స్వగ్రామాలకు వచ్చారు. వీరి కాంటాక్ట్ లిస్ట్ ను వైద్యులు సేకరిస్తున్నారు.

Advertisement

Next Story