- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చదువుకున్నారా? చదువుకొన్నారా?.. ఇంగితం లేదూ!
విద్యావంతుడైన తెలివి తక్కువ వ్యక్తిని దూషించాలంటే… చదువుకున్నావా? చదువు కొన్నావా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదూ? అని ప్రశ్నిస్తుంటాం.. గత వారంలో చోటుచేసుకుంటున్న సంఘటనలు చూస్తుంటే.. వాళ్లను ఈ ప్రశ్న అడగకుండా ఉండలేకపోతున్న పరిస్థితి తలెత్తుతోంది. ఇంతకీ ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే…
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వాలు, వైద్యులు, ప్రపంచ దేశాలు విస్తృత ప్రచారం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోజూ టీవీ ఆన్ చేసినా, పేపర్ తిరగేసినా, సోషల్ మీడియా ఓపెన్ చేసినా కరోనా సంబంధిత విశేషాలే రాజ్యమేలుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా అనుమానాలతో పలువుర్ని వైద్యులు చికిత్స చేస్తున్నారు. లక్షణాల తీవ్రతతో వారిని క్వారంటైన్ కేంద్రాలకు పరిమితం చేస్తున్నారు. దానిని వారు భరించలేకపోతున్నారు.
ఈ వారం ఆరంభంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా సోకిన వ్యక్తి ఆసుపత్రి నుంచి పరారై ఏపీ వైద్య ఆరోగ్య శాఖాధికారులను ఉరుకులు పరుగులు పెట్టించిన సంగతి తెలిసిందే. వైజాగ్‌లో మక్కా నుంచి వచ్చిన వ్యక్తి ప్రమాద హెచ్చరికలు వినికూడా అందర్లో కలిసిపోయి ఇంకొందరికి వ్యాపించేలా ప్రవర్తించిన వార్తలు కూడా విన్నవే.. తాజాగా దుబాయ్ నుంచి ముంబై వచ్చిన పశ్చిమ గోదావరికి చెందిన యువకుడిని పరీక్షించి క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి తప్పించుకున్న యువకుడు హైదరాబాద్ చేరుకుని, అక్కడ్నుంచి సొంతూరు వెళ్లేందుకు ప్రైవేటు బస్సెక్కాడు. అతడి చేతికి ఉన్న ముద్ర (స్టాంప్) ను చూసిన తోటి ప్రయాణికుడు ప్రశ్నించడంతో కంగారు పడ్డాడు. దీంతో వారు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎల్బీనగర్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
ఈ ఉదంతాలు ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. చదువుకోలేదా? విద్యావంతులే బాధ్యతారాహిత్యంతో ఉంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. సామాజిక బాధ్యత తెలియదా? వీరి అతి తెలివి కారణంగా ప్రాణంగా ప్రేమించిన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు కరోనా సోకితే ఫర్వాలేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tags: corona, janata curfew, corona quarantaine, quarantaine runs away, hyderabad, lb nagar, covid-19