- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. బుదవారం మేయర్ కు కోవిడ్ -19 టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని అధికారులు తెలిపారు. మేయర్ తో పాటు ఆమె భర్త, అత్తకు, పీఆర్వో కు సైతం కరోనా సోకిందని అధికారులు చెప్పారు. మేయర్ కుటుంబ సభ్యులకు కరోనా సోకడంతో బల్దియాలో వైరస్ భయం పట్టుకున్నది. ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారిని హోం క్వారంటైన్ కు తరలించి, వారికి పరీక్షలను నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం జిల్లాలో వచ్చిన ఫలితాలలో నగర మాజీ మేయర్ ఆకుల సుజాత కు సైతం పాజిటివ్ గా వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు. అదే రోజు మేయర్ అత్త కరోనా సోకి మృతిచందారు. ఆమె భర్తకు, వారి ఆడపడుచు మాజీ సీనియర్ కార్పోరేటర్ కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేకు అన్ లాక్ కాలంలో కరోనా సోకింది. కానీ, ఆయన త్వరగానే కోలుకున్నారు. తరువాతి కాలంలో కొందరు కార్పొరేటర్లు కరోనా బారిన పడ్డారు.