ఆ ఎమ్మెల్యేకు మరోసారి కరోనా పాజిటివ్ !

by srinivas |
ఆ ఎమ్మెల్యేకు మరోసారి కరోనా పాజిటివ్ !
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన ప్రకటించారు. జులై నెలలో అంబటికి.. మొదటిసారి కరోనా వైరస్ సోకగా హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకొని కోలుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో నిన్న జరిపిన కొవిడ్ టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. రీ ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం ఆశ్చర్యం కలిగించింది. అవసరమైతే ఆస్పత్రికి వెళ్తా. అందరి ఆశీస్సులతో మరోసారి కొవిడ్‌ను జయించి వస్తానని ట్విట్టర్‌లో అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed