వైట్‌ హౌస్‌లో కరోనా కలకలం

by vinod kumar |
వైట్‌ హౌస్‌లో కరోనా కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యమైన అమెరికాలో కరోనా కొరలు చాస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అయితే, తాజాగా కరోనా వైరస్ వైట్‌హౌస్‌లోకి ప్రవేశించింది. ఏకంగా డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహా దారుడు రాబర్ట్ ఓబ్రియన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అయితే, ప్రస్తుతం రాబర్ట్ ఓబ్రియన్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. అతడి నుంచి ఎవరికీ వైరస్ సోకలేదని స్పష్టం చేసింది. అయినా భద్రతా మండలి కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం లేకుండా… ఓబ్రియన్ క్వారంటైన్‌లో ఉండి విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించింది. అధికారిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించే రాబర్ట్ ఓబ్రియన్ ఈ నెల ప్యారీస్ పర్యటన చేశారు. కానీ, ఆయనకు కరోనా వైరస్ ఎలా వచ్చిందొ అన్న విషయం తెలియకపోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed