- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగ్గురు వలస కూలీలకు కరోనా
• జీహెచ్ఎంసీలో కొత్తగా 12 నమోదు
• రాష్ట్రంలో 1,122 చేరిన పాజిటివ్ కేసులు
దిశ, న్యూస్‌బ్యూరో :
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి లాక్‌డౌన్ విధించింది. ఇందులో భాగంగా వలస కార్మికులకు సైతం పనిప్రదేశాల్లోనే ఆహారం, వసతి కల్పించామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే గురువారం ముగ్గురు వలస కార్మికులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ప్రకటించింది. వీరితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో మరో 12 మందికి కొత్తగా పాజిటివ్ వచ్చింది. గురువారం వచ్చిన 15 కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,122కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 400 ఉండగా.. 693 మంది చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
రెడ్‌జోన్ పరిధిలోని మూడు జిల్లాల్లో వైన్స్ తెరిచిన దరిమిలా.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించిన మరుసటి రోజే వలస కూలీలకు కూడా కరోనా పాజిటివ్ రావడం గమనార్హం. లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి మొదటిసారిగా కూలీల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఈ ముగ్గురు వలస కార్మికుల కరోనా కేసులు ఏ జిల్లాలో నమోదయ్యాయనే వివరాలను ప్రభుత్వం ప్రకటించకపోవడం గమనార్హం..
Tags: GHMC, lockdown, coronavirus, KCR, Health, Telangana