భైంసాలో ముగ్గురికి కరోనా పాజిటివ్

by Aamani |
భైంసాలో ముగ్గురికి కరోనా పాజిటివ్
X

దిశ, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బుధవారం కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. మొత్తం 19 మందికి పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని ఏరియా ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ కాశీనాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.

Advertisement

Next Story