సర్కార్ స్కూళ్లో కరోనా కలకలం.. 128 మందికి టెస్టులు

by Aamani |
సర్కార్ స్కూళ్లో కరోనా కలకలం.. 128 మందికి టెస్టులు
X

దిశ, నిర్మల్ కల్చరల్: నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని అనంతపేట గ్రామంలో కరోనా కలకలం రేపింది. గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడికి రెండ్రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అక్కడి సిబ్బందితో పాటు విద్యార్థులు బెంబేలెత్తిపోయారు. పాఠశాలలో 128 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దీంతో గురువారం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు స్థానిక పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ శ్రుతి ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో అందరికీ నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story