బయ్యారంలో కరోనా కలకలం.. ఎంపీడీఓకు పాజిటివ్

by Shyam |   ( Updated:2021-12-07 01:19:14.0  )
Bayyaram MPDO Office
X

దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో కరోనా కలకలం సృష్టించింది. కరోనా అనుమానిత లక్షణాలతో ఎంపీడీఓ చలపతిరావు టెస్టు చేయించుకోగా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో బయ్యారం ఎంపీడీఓ కార్యాలయానికి ఇటీవల వివిధ పనులపై వచ్చిన వారు, ఆఫీసు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతూ, భయబ్రాంతులకు గురిచేస్తోన్న నేపథ్యంలో ఎంపీడీఓకు పాజిటివ్ రావడంతో ఆఫీసుకు రావాలంటే జనం భయంతో వణికిపోతున్నారు. ఇటీవల పోడు భూముల డేటాను ఎంపీడీఓ ఎంట్రీ చేస్తూ కార్యాలయంలో జూనియర్ కార్యదర్శులతో బిజీగా గడుపినట్లు సమాచారం. అంతేగాకుండా.. ఈ పనులు తహసీల్దార్ నాగభవాణి పర్యవేక్షణలో చేయడం గమనార్హం. దీంతో పంచాయితీ కార్యదర్శులు సైతం భయం భయంగా ఉన్నారు.

Advertisement

Next Story