- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో పన్నెండు శాతానికి పెరిగిన పాజిటివ్ కేసులు
దిశ, న్యూస్ బ్యూరో: జాతీయ సగటుకంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 44,431 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 5,406 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది. జాతీయ సగటు (పాజిటివిటీ రేటు) 7.4% ఉంటే తెలంగాణలో మాత్రం 12.16%గా నమోదైంది. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రం మొత్తం మీద 213 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 165 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో ఉంటే మెదక్ జిల్లాలో ఊహకు అందని విధంగా 13 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంతో పాటు ఆనుకుని ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలను మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో సోమవారం 15 కేసులు నమోదైతే మంగళవారం మాత్రం 19 కేసులు నమోదయ్యాయి. మెదక్ జిల్లాలో సోమవారం కేవలం ఒక్క కేసు నమోదైతే మంగళవారం ఏకంగా 13 పుట్టుకొచ్చాయి. సోమవారం ఒక్క రోజే రాష్ట్రంలోని ప్రభుత్వ ల్యాబ్‌లలో 1251 పరీక్షలు చేయగా 213 పాజిటివ్ నమోదయ్యాయి. సోమవారం ఒక్క రోజే పాజిటివిటీ 17% నమోదైంది. తాజాగా వివరాలను పరిశీలిస్తే ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రం మొత్తం మీద 213 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 5,406కు చేరుకుంది. ఇక నలుగురు కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 191కు చేరుకుంది.