- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో కరోనా @3427.. కరోనాను జయించిన వృద్ధురాలు
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం సర్వసాధారణంగా మారింది. గడచిన 24 గంటల్లో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఏపీ వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో ఇప్పటివరకూ కరోనా 3,427 మందికి సోకిందని ఆ శాఖ వెల్లడించింది. కరోనా బారి నుంచి 21 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. మొత్తం 3,427 పాజిటివ్ కేసుల్లో ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,294కి చేరుకోగా, వివిధ ఆస్పత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1,060 అని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా కారణంగా కృష్ణా జిల్లాలో గత 24 గంటల్లో ఇద్దరు మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 73కి చేరుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు కరోనా విజేతగా నిలిచింది. జీజీహెచ్‌లో కరోనాకి చికిత్స తీసుకున్న ఆమె 65 ఏళ్లకు పైబడిన వారు కరోనా బారినపడితే ప్రాణానికే ప్రమాదం అన్న మూఢనమ్మకాన్ని వమ్ము చేస్తూ, సంకల్పం, సరైన చికత్సావిధానం ఉంటే కరోనా నుంచి ఎవరైనా కోలుకోవచ్చని ఆమె నిరూపించారు.