ములుగు ఏరియా ఆస్పత్రిలో కరోనా ఫీవర్

by Shyam |
ములుగు ఏరియా ఆస్పత్రిలో కరోనా ఫీవర్
X

దిశ, వరంగల్: ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి కరోనా ఫీవర్ పట్టుకుంది. క్యాన్సర్ రోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. అతడికి వైద్య సేవలు అందించిన వైద్యులు, సిబ్బందిలో కలవరం మొదలైంది. ఈ మేరకు 30 మందిని ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేశారు. ఇద్దరు డాక్టర్లను విధులకు హాజరు కాకుండా ఇంటివద్దనే క్వారంటైన్‎లో ఉండాలని ఆదేశాలు జారీ చేయడం ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి నర్సింగాపూర్ గ్రామస్తుడు కావడంతో అప్రమత్తమైన అధికారులు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల సాయంతో ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed