ఎంత కష్టం.. జేసీబీతో అంత్యక్రియలు

by Shyam |   ( Updated:2020-07-28 11:17:08.0  )
ఎంత కష్టం.. జేసీబీతో అంత్యక్రియలు
X

దిశ, కోదాడ: జీవితంలో ఎన్ని సంపాదించినా.. చనిపోయాక పాడె మోయడానికి నలుగురు ఉంటే ఆయన ధన్యుడవుతాడు. కానీ మానవ సబంధాలను నాశనం చేస్తూ, మనిషి చివరి మజిలీని నలుగురి మధ్య జరపనియకుండా అడ్డుపడుతుంది కరోనా మహమ్మారి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ శివారులోని సాలార్ జంగ్‌పేటకు చెందిన చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృత్యువాత పడ్డాడు. దహన సంస్కారాలు చేయడానికి స్థానికులు, బంధువులు ముందుకు రాలేకపోయ్యారు. అందరూ ఉండి అనాథ శవంలా అంత్యక్రియలు పూర్తిచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోదాడ మున్సిపాలిటీ కమిషనర్ మల్లారెడ్డి చొరవ తీసుకుని మున్సిపల్ సిబ్బందితో కలసి జేసీబీ సాయంతో దహన సంస్కారాలు పూర్తిచేశారు.

Advertisement

Next Story