సీఎం ఇంటి ముందు కరోనా పేషెంట్ ఆందోళన

by Anukaran |
సీఎం ఇంటి ముందు కరోనా పేషెంట్ ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి ఇంటి ముందు కరోనా పేషెంట్ ఆందోళన చేసిన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరోనా సోకిన ఓ వ్యక్తి తనకు ఆస్పత్రిలో బెడ్ కేటయించడంలేదని, తనకు బెడ్ కేటాయించేలా ఆదేశించాలని ముఖ్యమంత్రి నివాసం ముందు ఆందోళన చేశాడు. తన పిల్లలతో అక్కడికి చేరుకుని ఆందోళన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కరోనా సోకిన తనకు ఆస్పత్రిలో బెడ్ కేటాయించడంలేదని, తన కుమారుడికి కూడా జ్వరమొస్తోందని, ఈ విషయమై వెంటనే సీఎం స్పందించి మాకు న్యాయం చేయాలని అతను ముఖ్యమంత్రిని వేడుకున్నట్లు తెలిస్తోంది.

Advertisement

Next Story