పెళ్లి భోజనాలకు వెళ్లిన వారందరికీ లక్షల విలువైన గిఫ్ట్ ఫ్రీ

by Anukaran |   ( Updated:2021-05-08 01:05:12.0  )
పెళ్లి భోజనాలకు వెళ్లిన వారందరికీ లక్షల విలువైన గిఫ్ట్ ఫ్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా దేశాన్ని పట్టి పీడిస్తుంది. ఎన్నో కుటుంబాలు ఈ మహమ్మారి వలన రోడ్డున పడుతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వాలు, పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నా కొంతమంది తెలిసి ,తెలియక చేసే పనులు కరోనాను ఇంకా పెంచుతున్నాయి. తాజాగా ఒక వ్యక్తి వలన మరో పదిమందికి కరోనా వచ్చిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. అరుణ్ మిశ్రా కు ఏప్రిల్ 27 న కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. అయితే ఈ మూర్ఖుడు అందరిలా క్వారంటైన్ లో ఉండకుండా నాకేం అయ్యింది.. అస్సలు అంటూ బయట తిరగడం మొదలు పెట్టాడు. అలాగే ఊర్లో జరిగే బంధువుల పెళ్లికి కూడా ఎంచక్కా తయారయ్యి వెళ్లాడు. తానూ ఒక్కడే వెళ్లడం కాకుండా వారి స్నేహితులను కూడా వెంటపెట్టుకెళ్లాడు. సరే.. ఇదంతా అయిపోయింది.

పెళ్లికి వెళ్లినవాడు ఒక మూల కూర్చొని పెళ్లి చూసుకొని వచ్చేయాలి.. అంతే కదా.. కానీ ఈ బాబు మాత్రం పెళ్లి పెద్ద నేనే అన్నట్టుగా ఆ కల్యాణ మండపంలో ఉన్నవారందరికీ పనులు పురమాయిస్తూ.. చేతులు కలుపుతూ షో చేశాడు. అసలు.. తాను లేకపోతే ఈ పెళ్లి జరగదన్నట్టు వచ్చినవారందరికి పెళ్లి భోజనాలు వడ్డించాడు. కరోనా పేషేంట్ తమకు వడ్డిస్తున్నాడని తెలియని వాళ్లు పెళ్లి భోజనం లాగించేశారు. ఇంకేముంది.. ఒక్కసారిగా ఆ గ్రామంలో కరోనా కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటివరకు తక్కువగా ఉన్న కేసులు ఒక్కసారిగా ఎలా పెరిగాయని ఆరా తీస్తే ఈ మూర్ఖపు శిఖామణి చేసిన పని బయటపడింది. వెంటనే అరుణ్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story