కళాత్మకంగా కరోనా జాగ్రత్తలు

by sudharani |
కళాత్మకంగా కరోనా జాగ్రత్తలు
X

కరోనా మహమ్మారి గురించి ఎంత తెలుసుకున్నా.. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో రోగాన్ని తరమాలంటే ముందుగా దానిపై అవగాహన అవసరం. ఆ అవగాహన కోసం సమాచారం తప్పనిసరి. సాధారణంగా టీవీ, పేపర్, రేడియో, స్మార్ట్‌ఫోన్ ద్వారానే ఆ సమాచారం అందుతుంది. కానీ, అవి కూడా లేని చోట ఎలా ? అలాంటి మారుమూల ప్రాంతాలకు వెళ్లి విషయాన్ని వివరంగా చెప్పడం కూడా సాధ్యం కాదు. అందుకే తన ఊరి ప్రజలకు తనే అర్థమయ్యేలా చెప్పాలని.. వీధి గోడలమీద పెయింటింగ్ వేసి మరీ కరోనాపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల సోమశేఖర్ గుడిపల్లి.

అనంతపురానికి చెందిన సోమశేఖర్.. యోగి వేమన యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ చదువుతున్నాడు. ఇప్పుడు కాలేజీకి కూడా సెలవు కావడంతో తన ఊరి ప్రజలకు కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇలా పెయింటింగ్‌ల రూపంలో చెబుతున్నాడు. బొమ్మలు వేయడమే కాకుండా వాటి పక్కన ‘మాస్క్‌లు వేసుకోండి, భౌతిక దూరం పాటించండి’ వంటి స్లోగన్లు కూడా రాస్తాడు. ఇప్పటివరకు తమ చుట్టుపక్కల ఉన్న 50 ఊళ్లల్లో 90కి పైగా పెయింటింగ్స్ వేసి తన కళను ప్రదర్శించడమే కాకుండా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed