ఆ ఉపాధ్యాయులకు కరోనా.. విద్యార్థులు సేఫ్

by vinod kumar |
Corona positive
X

దిశ, వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే ప్రత్యేక్ష పద్దతిలో విద్యానభ్యసించే ఉపాధ్యాయులు కాకపోవడంతో విద్యార్థులు ఊపిరి పిల్చుకున్నారు. ఈ ఇద్దరు ఉపాధ్యాయులు ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. ఆ ఉపాధ్యాయులకు కరోనా పాజిటీవ్ వచ్చినట్లు గురువారం వైద్యాధికారులు విద్యాధికారులకు సూచించారు. అయితే ఆ ఉపాధ్యాయులు హోమ్ క్వారంటైన్లోనే చికిత్స పోందుతున్నారని కళాశాల ప్రిన్సిపల్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed