- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమల్లోకి.. కరోనా బీమా
– 90 రోజుల పాటు ఒక్కొక్కరికి
– రూ.50 లక్షల కవర్
దిశ, న్యూస్ బ్యూరో: కరోనాను ఎదుర్కోవడంలో ముందుండి పోరాడుతున్న దేశంలోని హెల్త్ కేర్ స్టాఫ్‌కు ప్రధాని మోడీ ప్రకటించిన రూ.50లక్షల బీమా సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ బీమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బీమాలో భాగంగా కరోనాతో పోరాడుతున్న దేశంలోని 22లక్షల12వేల మంది హెల్త్ కేర్ వర్కర్లకు రూ.50 లక్షల చొప్పున బీమా కవర్ లభిస్తుంది. కరోనాతో పోరాడుతున్న ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర అన్నిరకాల ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, అందరు ఆరోగ్య సిబ్బందికి ఈ బీమా ఉపయోగపడనుంది. న్యూ ఇండియా అస్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సాధారణ బీమా సంస్థ ఈ ఇన్సూరెన్స్ ను అందజేస్తోంది. ఈ బీమా మార్చి 30వ తేదీ నుంచి 90 రోజుల పాటు అమలులో ఉండనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సుడాన్ సోమవారం ఒక పత్రికా ప్రకటన జారీ చేశారు.
Tags : corona, health care staff, insurance, pm garib kalyan yojana