- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా గుర్తింపు కార్డులు
దిశ, న్యూస్ బ్యూరో
కరోనా నివారణ చర్యల్లో పాల్గొనే వైద్య సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఆరోగ్య, కుటుంబ సంక్షమశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ కరోనా వైరస్ డ్యూటీ కార్డు‘గా పేర్కొనే ఈ ఐడీకార్డులను వెంటనే జారీ చేయాల్సిందిగా అన్ని జిల్లాల వైద్య శాఖ అధికారులకు ఆ శాఖ రాష్ట్ర డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన రెండు రోజుల నుంచి లాక్ డౌన్ కొనసాగుతున్నందున అత్యవసర విధులకు హాజరయ్యే ఉద్యోగులకు పోలీసుల నుంచి ఇబ్బందులు తలెత్తుతుండటంతో డైరెక్టర్ ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఉద్యోగులకు వారి శాఖ తరపున జారీ అయిన గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ, కరోనా విధులకు హాజరవుతున్నందున పోలీసుల నుంచి ఆంక్షలు సడలించే నిమిత్తం ఈ కార్డులు జారీ కానున్నాయి. ప్రతీ జిల్లా వైద్యాధికారి తన పరిధిలో ఉన్న వైద్యశాఖ సిబ్బందికి ఈ కార్డులు తక్షణం జారీ చేసేలా చర్యలు మొదలయ్యాయి. మార్చి 31 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉందన్న ముందస్తు అంచనాలతో ఈ కార్డులు ఉనికిలోకి రావడం గమనార్హం. వైద్య శాఖ తరహాలోనే రోడ్ల మీదకు వచ్చే అత్యవసర సేవల సిబ్బందికి కూడా ఈ తరహా కార్డులను ఆయా శాఖల ఉన్నతాధికారులు జారీ చేసే అవకాశం ఉంది.
Tags: Corona, Is, Health, Hospital, staff