‘హాకీ ఇండియా’లో ఇద్దరికి కరోనా

by Shyam |   ( Updated:2020-05-31 11:01:34.0  )
‘హాకీ ఇండియా’లో ఇద్దరికి కరోనా
X

దిశ, స్పోర్ట్స్: హాకీ ఇండియా ప్రధాన కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో సదరు కార్యాలయాన్ని 14 రోజుల పాటు మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు అకౌంట్ల విభాగంలో పని చేస్తుండగా, మరొకరు జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్ అని వెల్లడించారు. ఢిల్లీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరిద్దరినీ హోమ్ క్వారంటైన్‌లో ఉంచామని తెలిపారు. ఈ విషయం తెలియడంతో నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లు, ఒలింపిక్ అసోసియేషన్లతోపాటు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఉద్యోగులందరికీ కొవిడ్ టెస్టులు చేయించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నరిందర్ బత్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షల ఫలితాలు వచ్చే వరకూ ఉద్యోగులందరూ ఇంటి నుంచే పని చేయాలని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed