టీచర్లకు కరోనా.. విద్యార్థులకు హాలిడే..

by Shyam |
corona-effect 1
X

దిశ, హుస్నాబాద్: కరోనా థర్డ్ వేవ్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల ప్రారంభోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో టీచర్లు పాఠశాలలకు నిత్యం వెళుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. అందులో భాగంగానే ప్రతిరోజు పాఠశాలలను శానిటైజ్ చేస్తున్నా కొన్ని చోట్ల విద్యార్థులు, మరికొన్ని చోట్ల ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో పాఠశాలకు సెలవులు ఇవ్వడమే కాకుండా పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు భయంతో అందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు టెస్టులు చేయిస్తున్నారు. ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ వచ్చిన వెంటనే పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నారు.

పాఠశాలల్లో కరోనా…

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడితో పాటు అంతకపేట హైస్కూల్ లో పని చేస్తున్న మరో ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ వచ్చిన్నట్లు ఎంఈవో అర్జున్ తెలిపారు. అదే విధంగా కొహెడ మండలంలోని చెంచర్వపల్లి (సీసీపల్లి) హైస్కూల్ హెడ్ మాస్టర్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. దీంతో మిగితా ఉపాధ్యాయులు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోగా టీచర్లందరికీ నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు ఎంఈవో పేర్కొన్నారు. పాఠశాలల్లోని అన్ని తరగతి గదులు శానిటైజ్ చేసినట్లు ఎంఈవో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed