- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో కరోనా కలకలం.. ఆందోళనలో తల్లిదండ్రులు
X
దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు. మహమ్మారి ప్రభావం తగ్గిందని అంతా భావించారు. కానీ విద్యాసంస్థలు మొదలవడంతో భారీగా పిల్లలకు సోకుతోంది. ఈ క్రమంలో బెంగళూరులోని శ్రీచైతన్య విద్యాసంస్థల్లో కొందరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమయిన యాజమాన్యం స్కూల్ లో ఉన్న 480 మందికి టెస్టులు చేయించారు. ఇందులో దాదాపు 60 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యిందని బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ తెలిపారు. అయితే, ఇందులో ఇద్దరిలోనే లక్షణాలు(Covid symptoms) ఉన్నాయని, భయపడాల్సిందేమీ లేదని చెప్పారు. వైరస్ సోకిన విద్యార్థుల్లో 46 మంది కర్ణాటక వాసులు కాగా.. మిగిలిన 14 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని చెప్పారు. దీంతో విద్యాసంస్థను అక్టోబర్ 20 వరకు మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
Advertisement
Next Story