17 మంది లోక్‌సభ ఎంపీలకు కరోనా

by Shamantha N |   ( Updated:2020-09-14 04:53:00.0  )
17 మంది లోక్‌సభ ఎంపీలకు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా పార్లమెంట్, లోక్‌సభ సమావేశాలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు హాజరయ్యే దేశ వ్యాప్త ఎంపీలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చిన వారిని మాత్రమే పార్లమెంట్‌లోనికి అనుమతిస్తున్నారు. తాజాగా సోమవారం నిర్వహించిన పరీక్షల్లో 17 మంది లోక్‌సభ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మిగతా సభ్యుల్లో కరోనా ఆందోళన మొదలైంది.

Read Also…

రూ.1ఫైన్ కట్టిన ప్రశాంత్ భూషణ్..

Advertisement

Next Story