- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తమిళనాడులో 121 మంది చిన్నారులకు కరోనా
by vinod kumar |
X
తమిళనాడులో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు అక్కడ 2,085 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో 12 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు 121 మంది ఉన్నారని అధికారులు ప్రకటించారు. చిన్నారులపై వైరస్ ప్రభావం అంతగా ఉండదని ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇందుకు విరుద్ధంగా 121 మంది చిన్నారులకు వైరస్ సంక్రమించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో చెన్నైలో 103 కేసులు నమోదుతో ఈ సంఖ్య 673కు పెరిగింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 1128 మంది డిశ్చార్జి కాగా, 25 మంది మృత్యువాత పడ్డారు. తమిళనాడు వ్యాప్తంగా అన్ని జిల్లాలో కరోనా ప్రభావం ఉండగా, కేవలం ఒక్క కృష్ణగిరి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు ప్రకటించారు.
Tags: corona, tamil nadu, childrens, positive cases, chennai, krishnagiri, Covid-19
Advertisement
Next Story