- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వారికి ఆన్‌లైన్‌లో పాఠాలు.. మరి వీళ్లకు?
దిశ నల్లగొండ: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ విద్యాలయాలు మూతపడ్డాయి. పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో నిర్వాహకులు విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా విద్యాబోధనకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే కొన్ని విద్యాలయాలు ఈ విధంగా విద్యాబోధన చేస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ విద్యాలయాలు ఈ విధానానికి శ్రీకారం చుట్టాయి. కార్పొరేట్ ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థులు తమ ఇళ్లలోనే ఉండి ఆ స్కూళ్లు, కాలేజీల బోధనా అంశాలను కంప్యూటర్ లేక ఫోన్, లాప్ టాప్ ద్వారా తెలుసుకుంటున్నారు.
ప్రత్యేక యాప్ ద్వారా బోధనలు
ప్రత్యేక జూమ్ యాప్ ద్వారా బోధించడానికి ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. జూమ్ యాప్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఈ-మెయిల్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, ఈ మొబైల్ ద్వారా పంపిస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల వరకు విద్యాబోధనకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలలు ఇప్పటికే అందుకు సంబంధించిన టైం టేబుల్‌ను పంపించాయి. అందులో పాఠ్యాంశాలు బోధించే అధ్యాపకుల పేర్లు సమయాన్ని తెలియజేస్తున్నారు. ముందుగా డెమో క్లాసులను ప్రారంభించారు. ఈ తరగతుల ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్థులకు క్లాట్, జేఈఈ మెయిన్స్, నీట్, ఐఐటీ లాంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ఈ పరీక్షలతోపాటు ఆ యాత్రకు సంబంధించిన పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. బోధించిన పాఠ్యాంశాలను తదనంతరం పరీక్షలు నిర్వహించే పరిస్థితి ఉంది.
ఆసక్తిగా లేని విద్యార్థులు
ఆన్‌లైన్ విద్యావిధానం పట్ల విద్యార్థులు ఆసక్తిగా లేరు. ఈ విధానం పట్ల అంతగా అవగాహన లేకపోవడం, అలవాటు లేకపోవడంతో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల నిర్వాహకులు మాత్రం ఆన్‌లైన్ ద్వారా నేర్చుకోవలసిందేనని ఆదేశాలు జారీ చేస్తున్నారు. విద్యార్థులు చదువు పట్ల నిర్లక్ష్యం చేయకూడదని భావిస్తూ ఈ విధానంలో విద్యాబోధన చేస్తున్నామని కొందరు నిర్వాహకులు పేర్కొన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా బోధన ప్రారంభించాయి.
వెనుకబడనున్న ప్రభుత్వ విద్యాలయాలు
కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్ విద్యాబోధనతో ముందుకు సాగుతుండగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్నాయ్నాయ ఏర్పాట్లు కరువయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు లేకపోవడంతో వారు ఈ ఆన్‌లైన్ విద్యాబోధన చేయలేరు. ప్రభుత్వం ఇప్పటివరకు అలాంటి చొరవ చూపడం లేదు. అందుకు సంబంధించిన సాంకేతికతను ప్రభుత్వం సమకూర్చకపోవడం గమనార్హం. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల యజమానులు ఆన్‌లైన్‌లో బోధన చేయడం విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే పలువురు పేర్కొంటున్నారు.
Tags: Students, teaching online, college ownership, difficulties, corona effect