కల్వకుర్తిలో సారు బతుకు ఘోరం

by Anukaran |   ( Updated:2020-08-10 01:42:28.0  )
కల్వకుర్తిలో సారు బతుకు ఘోరం
X

దిశ, కల్వకుర్తి: విద్యాబుద్ధులు నేర్పిస్తూ సమాజాన్ని చైతన్య మార్గంలో నడిపించే ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్ల పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా మహమ్మారి పుణ్యమా అని విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో టీచర్లు, లెక్చరర్లు రోడ్డున పడ్డారు. ఇన్నాళ్లు ఉద్యోగం మీదే ఆధార‌ప‌డి బ‌తికిన వేలాదిమంది టీచ‌ర్లు ఇప్పుడు ఏం చేయ‌లో అర్థం కాక ఆగ‌మాగ‌మ‌వుతున్నారు. ఆదుకోవాల్సిన యాజ‌మాన్యాలు మీరెవరో అన్నట్లుగా చూస్తున్నాయి. దీంతో జీతాల్లేక ఆగమవుతున్నారు. పస్తులుండలేక కూలీలుగా మారి ఉపాధి హామీ , తాపీ పనులకు వెళ్తున్నారు. పొలం పనులు చేసుకుంటు జీనవం గడుపుతున్నారు. ఇన్నాళ్లు పిల్లల భవిష్యత్​ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు శ్రమించిన వారి భవిష్యత్​ కరోనా పుణ్యమా అని అంధకారంలో మగ్గిపోతున్నది.

ఉపాధి పని చేస్తున్న: రాజేష్, ప్రైవేటు ఉపాధ్యాయుడు

నేను హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసేవాడిని. లా క్ డౌన్ విధించడం తో ఊరికి వచ్చిన. స్కూళ్లు ప్రారంభమైతలేవు. జీతం రాక ఇబ్బంది అయితంది. ఉపాధి పనికి పోతున్న. బతకాలే కాబట్టి ఏదైనా పని చేయాలే కదా.. అందుకే ఇలా.

వంటలు వండేందుకు పోతున్న: ఎం. సత్యనారాయణ, ప్రైవేటు టీచర్​

పాఠశాలలు తెరవకపోవడంతో రోడ్డున పడ్డా. కుటుం బ పోషణ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న. ఏ పని లేక నేను వంటలు చేసేందుకు వెళ్తున్న. ఎలాగై నా ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలి.

ఆగమవుతున్నం : సురేష్​, ప్రైవేటు టీచర్​

కరోనా కారణంగా పని లేక, జీతం లేక ఆగమవుతున్నాం. ఇన్నాళ్లు తమతో పని చేయించుకున్న స్కూళ్లు ఇప్పుడు పట్టించుకుంట లేవు. ప్రైవేటు టీచర్ల బతుకు దుర్భరమైంది. ఎప్పుడు స్కూళ్లు తెరుస్తరో తెల్వదు. అప్పటి వరకు ఎట్ల బతుకాల్నో అర్థం కావడంలేదు.

వ్యవసాయ పనులు చూసుకుంటున్న: భాస్కర్​, తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు​

ఆరునెలలుగా కరోనా నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు మూత పడ్డాయి. జీతా ల్లేక ఇంటి అద్దె, కరెంట్ బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. పొట్టకూటి కోసం నేను పొలం పనులకు వెళ్తున్న.

Advertisement

Next Story

Most Viewed