కరోనా తగ్గిపోయింది!

by Shyam |
కరోనా తగ్గిపోయింది!
X

థాయ్‌లాండ్‌లో కరోనా వైరస్ సోకిన ఓ వ్యక్తి పూర్తిగా కోలుకోవడంతో, ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. చైనా టూరిస్టులతో తిరిగిన 50 ఏళ్ల ఓ ట్యాక్సీ డ్రైవర్ థాయ్‌లాండ్‌లో మొదటి కరోనా వైరస్ సోకిన పేషెంటు. ఆయనతో మరో తొమ్మిది మందికి కూడా కరోనా ఉన్నట్లు వైద్యులు గుర్తించి చికిత్స ప్రారంభించారు.

ప్రస్తుతం ట్యాక్సీ డ్రైవర్‌కి పూర్తిగా తగ్గిపోయిందని మిగతా వారు త్వరలో కోలుకుంటారని నొంతాబురిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆరోగ్య మంత్రి అనుటిన్ చర్నివిరకుల్ వెల్లడించారు. ట్యాక్సీ డ్రైవర్‌ బంధువులు అందరికీ పరీక్షలు చేసినప్పటికీ వాళ్లెవరికీ ఈ వ్యాధి సోకలేదని అనుటిన్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story