- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో కరోనా ఆస్పత్రులు ఇవే
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులను కరోనా సేవలు అందించేందుకు సిద్ధం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను మూడు కేటగిరీలుగా విభజించింది. కేటగిరీ వన్‌లో కరోనా చికిత్సకు వెంటిలేటర్ సదుపాయంతో పాటు అన్ని సదుపాయాలు ఉండే ఆస్పత్రులను ఎంపిక చేసింది. ఇందులో కేవలం 19 ఆస్పత్రులకు మాత్రమే స్థానం కల్పించింది.
అనంతపురం జిల్లాలో సవేరా ఆస్పత్రిని మాత్రమే కేటగిరీ వన్‌లో చూపించింది. చిత్తూరు జిల్లాలోని అరగొండలో గల అపోలో, పద్మావతి మెడికల్ కాలేజీలోని ఆస్పత్రులను చేర్చింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ అండ్ జనరల్ ఆస్ప్రతిని ఉంచింది. గుంటూరులో మంగళగిరి ఎయిమ్స్‌తో పాటు ఎన్ఆర్ఐ ఆస్పత్రిని కూడా చేర్చింది. కృష్ణా జిల్లా గన్నవరంలో పిన్నమనేని మెడికల్ కాలేజీ ఆస్పత్రితో పాటు జీజీహెచ్ విజయవాడను ఉంచింది. కర్నూలులో శాంతిరామ్ మెడికల్ కాలేజీ, ప్రకాశం జిల్లాలో కిమ్స్, నెల్లూరు జిల్లాలో నారాయణ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి, జీజీహెచ్, శ్రీకాకుళంలో గ్రంధి మల్లిఖార్జునరావు మెడికల్ సైన్సెస్ ఆదిత్య హాస్పిటల్, వైజాగ్‌లో విమ్స్, గీతమ్ మెడికల్ కాలేజీ, ఐఎన్‌హెచ్ఎస్, విజయనగరం జిల్లాలో మిమ్స్, పశ్చిమగోదావరి జిల్లాలో అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కడపలో ఫాతిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను ఎంపిక చేశారు.
కరోనా రెండవ కేటగిరీ ఆస్పత్రుల వివరాల్లోకి వెళ్తే…
అనంతపురం జిల్లాలోని ఐదు ఆస్పత్రులు, చిత్తూరు జిల్లాలోని ఐదు ఆస్పత్రులు, తూర్పుగోదావరి జిల్లాలోని ఐదు, గుంటూరులోని ఆరు ఆస్పత్రులు, కృష్ణాలో ఆరు, కర్నూలులో ఆరు, ప్రకాశంలో ఐదు, నెల్లూరులో ఐదు, పశ్చిమ గోదావరిలో ఐదు, కడప జిల్లాలో ఐదు ఆస్పత్రులను చేర్చారు.
ఇక మూడవ కేటగిరీలో చిత్తూరు జిల్లాలో 9 ఆస్పత్రులు, తూర్పుగోదావరిలో ఒక్కటి, గుంటూరులో 51, కృష్ణాలో 41, కర్నూలులో 36, ప్రకాశంలో 30, నెల్లూరులో 17, శ్రీకాకుళంలో 7, విశాఖపట్టణంలో 46, విజయనగరంలో 9, పశ్చిమగోదావరిలో 2, కడప జిల్లాలో 20 ఆస్పత్రులను చేర్చారు.