- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరుజీవులపై కరోనా దెబ్బ
దిశ, న్యూస్ బ్యూరో: విదేశాల నుంచి వచ్చిన వారిలో మాత్రమే కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయనేది ఊరటనిచ్చే మాటే అయినా దాని ప్రభావం మాత్రం అన్ని రంగాలపై కనిపిస్తోంది. ముందు జాగ్రత్త చర్యలుగా ప్రభుత్వం ఇప్పటికే విద్యాసంస్థలుసహా పలు వ్యాపార సముదాయాలను మూసివేసేలా నిర్ణయించింది. నిత్యవసరాలు, ఆహార ఉత్పత్తులకు సంబంధించిన సంస్థలకు కొంత మినహాయింపునిచ్చింది. అయితే, ఇప్పటికే కరోనా (కోవిడ్-19) ప్రభావం బడుగు జీవులపై పడింది. రోజూ పని చేస్తే తప్ప ఇల్లు గడవని వారికి గుదిబండలాఈ వైరస్ మారింది.
కరో‘న’ హ్యాండ్ షేక్..
మాస్క్‌లు ధరించాలనీ, ఎప్పటికప్పుడూ చేతులు శుభ్రపరుచుకోవాలని, కరచాలనం చేయొద్దని వైద్య, ఆరోగ్య, ప్రభుత్వ విభాగాలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీధుల్లో, రోడ్ల పక్కన పండ్లు, కూరగాయలు అమ్ముకునేవారికీ గిరాకీ తగ్గిపోయింది. రోజూ రూ.300–500 వరకూ అమ్ముకుని ఇంటికి వెళ్లే తాము.. ఇప్పుడు కొనేవాళ్లే లేక ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. అంతకుముందు రెగ్యులర్‌గా తమ వద్ద కొనుగోళ్లు చేసేవారూ ఇప్పుడు కొనడంలేదని రామంతాపూర్‌లో తోపుడుబండిపై కూరగాయలు అమ్ముకునే సుగుణమ్మ అంటోంది. హోల్‌సేల్ పండ్ల మార్కెట్ల నుంచి తెచ్చి రోడ్ల మీద అమ్ముకునేవారిది ఇదే పరిస్థితి. దానిమ్మ, ఆపిల్, ద్రాక్ష పండ్ల బేరంలో ఒక్కో బాక్స్‌పై గరిష్టంగా రూ.300 వరకూ మిగులుతుంది. కరోనా మహమ్మారి ప్రభావంతో కొనేవాళ్లు అసలు రావడంలేదని చెబుతున్నారు. వినియోగదారులు హైజీనిక్ కోణంలో ఆలోచించడం వల్లే వీధుల్లో, తోపుడు బండ్లపై పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు కొనడం తగ్గిపోయింది. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఛాట్ బండార్ల వ్యాపారం కూడా 40 శాతం తగ్గిపోయినట్టు నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రైవేటు క్యాబ్ డ్రైవర్లపైనా ప్రభావం
పాఠశాలలకు, ఉద్యోగులకు సెలవులు ఇవ్వడంతో ఆ ప్రభావం ఆటోలు, ప్రైవేటు కారు డ్రైవర్లు, ఓనర్లపైనా కనిపిస్తోంది. రోజూ స్కూళ్లకు, ఆఫీసుల నుంచి డ్రాప్ అండ్ పికప్ చేసేవారు. నెల చొప్పున మాట్లాడుకునేవారు. ఉద్యోగి హోదాను బట్టి నెలకు రూ.5 వేల వరకూ సంపాదించే డ్రైవర్లూ ఉన్నారు. ఆటోలో ఒక్కో విద్యార్థికి రూ.300– 1000 వరకూ క్యాబ్ల్లోనైతే ఒక్కొక్కరికి రూ.1,200 వరకూ తీసుకునేవారు. ఇప్పుడు వారంతా నష్టపోతున్నారు. ప్రైవేటు క్యాబ్‌లను నడుపుతూ డ్రైవర్ కం ఓనర్ పద్ధతిలో కుటుంబాన్ని గడుపుతున్నవారికి పరిస్థితి మరీ గడ్డుకాలంగా తయారైంది. వెహికల్ ఈఎంఐ, మెయింటనెన్స్ కలిపి రూ.30 వేల వరకూ ఖర్చు వస్తోంది. సగం నెలా నడవకపోతే చెల్లింపులు చేయడం, కుటుంబాన్ని గడపటం కూడా కష్టమైపోతుందని డ్రైవర్లు చెబుతున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీలోని పలు ఐటీ, సాఫ్ట్ వేర్ కంపెనీలకు కార్లు, బస్సులు ఎంగేజ్ పెట్టిన వారికి ఒక్కో వెహికల్ మీద రూ.లక్ష వరకూ వస్తోంది. ఇప్పుడు ఆ ఆదాయాన్ని కోల్పోతుండటంతో వాహనాలను నిలుపుకోవాలంటే అప్పుల కోసం వెతుక్కుంటున్నామని ఓ ప్రైవేటు బస్ ఆపరేటర్ నిర్వాహకుడు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల, మెట్రోల్లోనూ ఉద్యోగులు, విద్యార్థులు సంఖ్య తగ్గిపోవడంతో ప్రయాణికుల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపిస్తోంది. వచ్చేనెలా వరకూ కరోనా ప్రభావం ఉంటుందనే అంచనాలతో చిరువ్యాపారుల, ప్రైవేటు ట్రావెల్ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు.
Tags : corona impact, covid-19, unorganised sector, hyderabad