తెలంగాణలో కమ్యూనిటీ స్ప్రెడ్ జరగలేదు: ఈటల

by vinod kumar |   ( Updated:2020-04-05 23:42:09.0  )
తెలంగాణలో కమ్యూనిటీ స్ప్రెడ్ జరగలేదు: ఈటల
X

ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తెలంగాణలో ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కమ్యూనిటీ స్ప్రెడ్ కాలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదు అవుతున్న కేసులన్నీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారివే అని తెలిపారు. ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనలకు తెలంగాణ నుంచి 1090 మంది వెళ్లారని, వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని, వారు ఎవరెవరిని కలిశారో అన్న దానిపై కూడా ఆరా తీస్తున్నామని అన్నారు.

Tags : Corona Virus, telangana, Communal Spread, minister itala rajendar

Advertisement

Next Story