- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్యూటీ పార్లర్‌లో కరోనా దందా
దిశ, క్రైమ్‌బ్యూరో: కరోనా క్లిష్ట పరిస్థితులను కొందరు వ్యాపారంగా మార్చుకొని దందా చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఒక ప్రముఖ బ్యూటీ పార్లర్ ఇటీవలి కాలంలో కస్టమర్లు లేకపోవడంతో కరోనా పాజిటివ్ పేషెంట్ల కోసం ఐసోలేషన్ సెంటర్‌గా మార్చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుండడంతో ఆ బ్యూటీ పార్లర్ నిర్వాహకులపై శనివారం జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు అధికారి శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం… జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లో కలర్స్ బ్యూటీ స్టూడియోలో ఐసోలేషన్ సెంటర్ నిర్వహిస్తున్నట్టు సమాచారం వచ్చిందని, వెంటనే తనిఖీ చేశామన్నారు. కరోనా లక్షణాలు కలిగిన వారికి 14రోజుల క్వారంటైన్‌కు రూ.10 వేలు వసూలు చేస్తున్నట్టు వెల్లడైందన్నారు. తాము తనిఖీ చేసిన సమయంలో క్వారంటైన్‌లో నలుగురు కరోనా బాధితులు ఉన్నట్టు గుర్తించామన్నారు. నిర్వాకుడైన సంపత్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.