- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్ ఎఫెక్ట్.. కరీంనగర్ జిల్లాపై కరోనా పంజా.!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాను వైరస్ వీడటం లేదు. గత నెల రోజులుగా కేసులు నమోదులో మార్పు కనిపించడం లేదు. అన్ని జిల్లాల్లో తగ్గినా, కరీంనగర్‌లో మాత్రం వ్యాప్తి కొనసాగుతూనే ఉన్నది. జనసాంద్రత ప్రకారం జీహెచ్ఎంసీతో పోల్చితే కరీంనగర్‌లో నమోదయ్యే కేసులే ఎక్కువున్నాయి. అనధికారిక కేసులనూ కలిపితే ప్రతీ రోజూ బులిటెన్‌లో ప్రకటించే దాని కంటే మూడు రెట్లు అధికంగా ఉంటాయని ఆ జిల్లా అధికారులు ఆప్ ది రికార్డులో చెబుతున్నారు.
కొనసాగుతున్న తీవ్రత..
హుజురాబాద్ ఉప ఎన్నిక పేరుతో గత నెల రోజుల నుంచి ఆ నియోజకవర్గంలో జరిగిన రాజకీయ సభలు, కార్యక్రమాలతోనే వైరస్ తీవ్రత ఇంకా కొనసాగుతున్నదని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైద్యాధికారుల్లో ఒకరు ‘దిశ’కు తెలిపారు. ప్రతీ రోజూ నిర్వహించిన విసృత ప్రచారాలతో వ్యాప్తి పెరిగిందన్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరిగిన కార్యకర్తల ద్వారా ఎక్కువ వ్యాప్తి జరిగినట్లు స్థానిక వైద్యాధికారులు గుర్తించారు.
ప్రభుత్వానికి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కానీ, ప్రభుత్వానికి పార్టీ గెలుపుపై ఉన్న ప్రేమ ప్రజలపై ఎక్కడుంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. కరోనా లక్షణాలతో ఉన్న వ్యక్తులు ఇంటింటికీ తిరగడం వలన వ్యాప్తి రేటు పెరిగింది. అంతేగాక చాలా మంది వ్యాక్సిన్ పొందకుండానే ప్రచారాలకు వెళ్తున్నారు. టీకా కంటే మనీకి విలువ ఇస్తున్నట్లు స్వయంగా ఆఫీసర్లు చెప్పడం గమనార్హం.
పాజిటివ్ వచ్చిన వాళ్లు ఆర్ఎంపీ దగ్గరకు..
కరోనా ట్రీట్‌మెంట్ ప్రోటోకాల్ సాధారణంగా మారిపోవడంతో చాలా మంది కరోనా లక్షణాలు తేలగానే ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లి టెస్టులు చేయించుకుంటున్నారు. పాజిటివ్‌గా తేలితే స్థానికంగా ఉండే ఆర్ఎంపీ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. మరి కొందరు ఇళ్లల్లోనే సిక్రేట్‌గా హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇలాంటి కేసుల్లో కొన్ని అధికారిక రిపోర్టులలో నమోదు కావడం లేదని స్వయంగా వైద్యాధికారులే చెబుతున్నారు.
అధికారికంగా 190.. అనధికారంగా మూడు రెట్లు ఎక్కువ..
గత నెల 29వ తేదీ నుంచి ఈ నెల 4 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 190 కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ బులెటెన్‌లో పేర్కొన్నది. కానీ ఒక్క మండలంలోనే ఈ కేసుల సంఖ్య వచ్చినట్టు స్థానిక మెడికల్ ఆఫీసర్లు పేర్కొన్నారు. లీడర్ల నిర్లక్ష్యంతోనే కేసులు పెరుగుతున్నాయని క్షేత్రస్థాయి డాక్టర్లు మండిపడుతున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే వైరస్ వ్యాప్తిని అదుపు చేయడం కష్టమవుతుందని వైద్యులు వివరిస్తున్నారు. థర్డ్ వేవ్ అనేది వస్తే అది ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే షురూ అవుతుందని హుజురాబాద్ నియోజకవర్గంలోని ఓ పీహెచ్‌సీ డాక్టర్ జోస్యం చెప్పారు.