విజృంభిస్తోన్న కరోనా.. ఫలితాన్నివ్వని నైట్ కర్ఫ్యూ

by vinod kumar |
Corona virus, night curfew
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వ్యాధి కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏ మాత్రం ఫలితానివ్వడం లేదు. ఈ నెల 20 నుంచి నైట్‌కర్ఫ్యూ విధించినప్పటికీ కేసులు అదుపుకావడం లేదు. రాత్రి 8గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నిబంధనలు విధించినా కేసుల పెరుగుదలను నిలువరించలేక పోతున్నారు. కర్ఫ్యూ విధించిన ఈ నెల 20న 6,542 కేసులు నమోదుకాగా శనివారం(ఏప్రిల్ 24)న 8,126 కేసులు నమోదయ్యాయి.

దీంతో ఇప్పటి వరకు మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 62,929కి చేరింది. ఒక రోజులోనే 38 మంది చనిపోగా మృతుల సంఖ్య 1999కి పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1259 కేసులు నమొదుకాగా ఆదిలాబాద్‌లో 119, భద్రాద్రి కొత్తగూడెంలో 187, జగిత్యాలలో 264, జనగాంలో 140, కామారెడ్డిలో 180, కరీంనగర్‌లో 286, ఖమ్మం 339, మహబూబ్‌నగర్‌లో 306, మహబూబాబాద్‌లో 148, మంచిర్యాలలో 233, మెదక్‌లో 192, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 676, నల్గొండలో 346, నిజామాబాద్‌లో 497, పెద్దపల్లిలో 121, రాజన్నసిరిసిల్లాలో 164, రంగారెడ్డిలో 591, సంగారెడ్డిలో 201, సిద్దిపేటలో 306, సూర్యాపేటలో 168, వికారాబద్‌లో 185, వనపర్తిలో 100, వరంగల్ రూరల్ లో 175, వరంగల్ అర్బన్ లో 334, యాదాద్రి భువనగిరిలో 167 కేసులు నమోదయ్యాయి, అత్యల్పంగా నాగర్‌కర్నూల్‌లో 47 కేసులు నమోదయ్యాయి.

Advertisement

Next Story