- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా అదుపులోనే ఉంది : కేటీఆర్
దిశ, వెబ్‌డెస్క్ :
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనా నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అద్భుతంగా పని చేస్తోందని చెప్పారు. పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలు కలిసి పనిచేయడం వల్లే ఈ ఏడాది సీజనల్ వ్యాధులు కూడా బాగా తగ్గాయన్నారు. రోగాలు, వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. తాజాగా నమోదయ్యే కేసులే అందుకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం కొత్తగా 1,869 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 12 మంది మృతి చెందగా, ఇప్పటివరకూ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,06,644కు చేరుకుంది. తాజా మరణాలతో కలిపి మొత్తం మరణాలు 1,201కు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 26,368 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 79,075 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 294, రంగారెడ్డి 211, మేడ్చల్ 154 కేసులు నమోదయ్యాయి.