- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో అదుపులోకి వస్తున్న కరోనా
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ అదుపులోకి వస్తున్నట్టు కనిపిస్తోంది. గత వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ.. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్యతో డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య సమానంగా ఉంటుంది. దీంతో కరోనా వైరస్ దారికొస్తున్నట్టే కనిపిస్తోందని వైద్యులంటున్నారు.
మార్చి 22 నుంచి మూడు దశలుగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి భారతావని లాక్‌డౌన్ విధించింది. అయినప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు కొలిక్కి రావడం లేదు సరికదా పెరిగిపోతున్నాయి. దీంతో కరోనా చైన్ బ్రేక్ చేసేందుకు విధించిన లాక్‌డౌన్ ఫలితం లేకుండా పోయిందన్న ఆరోపణలున్నాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కఠిన ఆంక్షలు విధించినా కరోనా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఎత్తివేస్తే తీవ్రపరిణామాలు చూడాల్సి ఉంటుందంటూ హెచ్చరికలు వినిపించాయి. జోన్‌లుగా విభజించి సడలింపులు ఇచ్చారు.
దీంతో ఏపీలో ఒకే ఒక్క గ్రీన్ జోన్‌గా నమోదైన విజయనగరం జిల్లా కూడా కరోనా బారిన పడింది. కరోనా పాజిటివ్‌గా తేలిన తొలికేసులో మరణం కూడా సంభవించింది. దీంతో సడలింపుల ఫలితం తేలిందంటూ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కరోనా బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో 1980 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 45 మంది మృత్యువాత పడ్డారు. మిగిలిన వారిలో 1010 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుంటే.. 925 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కేసులు నమోదవుతున్న తీరులోనే కోలుకుంటున్నవారు కూడా ఉండడం వైద్య ఆరోగ్య శాఖలో ఆనందాన్ని నింపుతోంది.