తెలంగాణలో 35వేలకు చేరువలో కరోనా కేసులు

by Anukaran |   ( Updated:2020-07-12 11:58:50.0  )
తెలంగాణలో 35వేలకు చేరువలో కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గడిచిన 24గంటల్లో 1,269 కరోనా పాజిటివ్‌లు నమోదుకావడంతో కేసుల సంఖ్య 34,671కి చేరింది. ఇవాళ 8మంది చనిపోగా ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 356గా ఉంది. ఇవాళ 1,563మంది డిశ్చార్జ్ అయ్యారు. 11,883 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా చికిత్స తీసుకొని 22,842మంది కోలుకున్నారు. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 800 కరోనా కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 312, మేడ్చల్ జిల్లాలో 94మందికి పాజిటివ్ వచ్చింది.

Advertisement

Next Story