ఫ్లాష్ ఫ్లాష్ : టోక్యో ఒలింపిక్ విలేజ్‌లో కరోనా కలకలం

by Anukaran |
Olympics
X

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్-2020 నిర్వాహణ కష్టతరంగా మారింది. ఒలింపిక్స్ విలేజ్‌లో తాజాగా తొలి కరోనా కేసు కలకలం సృష్టించింది. అయితే, ఆ కేసు అథ్లెట్‌కు వచ్చిందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడగా.. 2021లో నిర్వహించాలని ఎట్టకేలకు జపాన్ కీడ్రా మంత్రిత్వ శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఈనెల 13న ఒలింపిక్ గ్రామాన్ని నిర్వాహకులు తెరువగా.. ప్రతీరోజు అక్కడ కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్దారణ జరిగింది. ప్రస్తుతం ఆ వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తు్న్నట్లు సమాచారం. కాగా, జూలై -23న అధికారంగా ఒలింపిక్స్ ప్రారంభం కానుండగా అందులో 11వేల మంది అథ్లెట్స్ పాల్గొననున్నారు.

Advertisement

Next Story

Most Viewed