కొండపోచమ్మ సాగర్ నిర్మాణ పనుల్లో వివాదం

by Shyam |
కొండపోచమ్మ సాగర్ నిర్మాణ పనుల్లో వివాదం
X

దిశ మెదక్: సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో కొనసాగుతున్న కొండపోచమ్మ సాగర్ నిర్మాణ పనుల్లో వివాదం నెలకొంది. మామిడ్యాల్, బహిలంపూర్, తనేదార్‌పల్లి భూములకు సంబంధించిన వివాదం కోర్టులో స్టే ఉండగా.. ఆ గ్రామాలకు వెళ్లే రోడ్డు మూసివేసేందుకు అధికారులు పనులు చేపట్టారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ పనులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. పోలీసులు దాడి చేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుపుతున్నారని ఆరోపించారు. ఈ వివాదంపై కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నప్పుట్టికీ.. కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా పనులు జరపటం ఏంటని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను ఉల్లంగించిన వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి తమపై దాడికి దిగటం అన్యాయం అన్నారు. తమపై దాడి చేసిన పోలీసులపై SC/ST నిరోధక చట్టం 2015 ప్రకారంగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Tags: Controversy, over construction, Kondapochamma Sagar, medak

Advertisement

Next Story

Most Viewed