రాజన్న ఆలయంలో వివాదం.. కత్తితో పొడుస్తానంటూ భక్తులపై..!

by Sridhar Babu |   ( Updated:2021-12-24 07:24:02.0  )
రాజన్న ఆలయంలో వివాదం.. కత్తితో పొడుస్తానంటూ భక్తులపై..!
X

దిశ వేములవాడ టౌన్: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని కల్యాణ కట్ట వద్ద భక్తులకు-నాయి బ్రాహ్మణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కల్యాణ కట్ట వద్ద పని చేసే నాయి బ్రహ్మణులు భక్తులను డబ్బులు అడగగా.. అందుకు నిరాకరించడంతో తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఓ సమయంలో భక్తుడిని కత్తితో పొడిచి వేస్తా అని నాయి బ్రాహ్మణుడు అనడంతో వివాదం మరింత ముదిరింది. విషయం తెలుసుకున్న ఆలయ ఏఈవో హరికిషన్ సంఘటన స్థలానికి చేరుకుని భక్తులను సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది.

Advertisement

Next Story