పల్లెలపై నిఘా.. రాత్రిళ్లు డ్రోన్ కెమెరాల కన్ను

by Sridhar Babu |   ( Updated:2020-05-28 08:51:49.0  )
పల్లెలపై నిఘా.. రాత్రిళ్లు డ్రోన్ కెమెరాల కన్ను
X

దిశ, కరీంనగర్ :
లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ పల్లె టూర్లలో అసాంఘిక కార్యక్రమాల నియంత్రణకు ఇక మీదట రాత్రి వేళలో డ్రోన్ కెమెరాల ద్వారా శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నట్టు రాష్ట్ర పోలీసు విభాగం సమాయత్తం అవుతోంది.ఇందులో భాగంగానే సిరిసిల్ల జిల్లాను పైలట్ ప్రాజెక్టు కింద ఎంచుకున్నారు. పెట్రోలింగ్ వాహనాలకు అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసిన ఈ డ్రోన్ కెమెరాలు పోలీసులు చేరుకోలేని ప్రాంతాల్లో ఫోటోలు తీస్తుంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, ఇతరాత్ర అసాంఘిక కార్యకలాపాలను రికార్డు చేసేందుకు వీటిని ఉపయోగించనున్నారు. తెలంగాణ హబ్ ఏర్పాటు చేసిన ఈ కెమెరాలను ఆయా పోలీస్‌స్టేషన్లకు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డె అందజేశారు. పెట్రోలింగ్ వాహనంలో ఉండే ఆపరేటర్ డ్రోన్ కెమెరాను ఆపరేట్ చేస్తుంటాడు. రాత్రి వేళల్లో కూడా నిఘా పెట్టేందుకు థర్మల్ డ్రోన్ కెమెరాను కూడా వినియోగించనున్నారు. ప్రయోగాత్మకంగా సిరిసిల్లలో చేపట్టిన ఈ కార్యక్రమం ఆచరణలో సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.ముఖ్యంగా డ్రోన్ కెమెరాలకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ అంతా కూడా జిల్లా కేంద్రంలోనే ఉంటుందని ఎస్పీ వివరించారు.ఈ పద్దతి వల్ల నేరాలను మరింత కట్టడి చేసే అవకాశం ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే నేరస్థులను గుర్తించే కూడా అవకాశం ఉంటుందని తెలిపారు.

Advertisement

Next Story