సీఎంకి జీతం రూ.1.. ఇన్‌కమ్ ట్యాక్స్ రూ.7 లక్షలు.. ఎక్కడంటే?

by srinivas |   ( Updated:2021-03-19 01:25:36.0  )
సీఎంకి జీతం రూ.1.. ఇన్‌కమ్ ట్యాక్స్ రూ.7 లక్షలు.. ఎక్కడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి ఇన్‌కమ్ ట్యాక్స్ నిధులు చెల్లింపు వ్యవహారం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. తాజాగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సీఎం జగన్ చెల్లించాల్సిన రూ.7,14,924 ఇన్‌కమ్ ట్యాక్స్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు జీఏడీ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి. జగన్‌తో పాటు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఆదాయ పన్నుగా చెల్లించాల్సిన రూ.2,91,096 కూడా ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ క్రమంలో దీనిపై ప్రతిపక్షాలు విమర్శనస్త్రాలు మొదలుపెట్టాయి. రూ.1 జీతం తీసుకునే జగన్‌కు రూ.7.14 లక్షల ఇన్‌కమ్ ట్యాక్స్ నిధులు ఎలా మంజూరు చేశారంటూ విమర్శలు మొదలుపెట్టాయి. కాగా తాను రూ.1 మాత్రమే జీతం తీసుకుంటానని సీఎం జగన్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed