- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఏపీలో పెరిగిన విద్యుత్ వినియోగం.. అధికారుల అలర్ట్
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ప్రస్తుతం రోజుకు గరిష్టంగా 208 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతుంది. గత ఏడాది మార్చ్ లో గరిష్ట వినియోగం 206 మిలియన్ యూనిట్లు అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అత్యధికంగా 208 యూనిట్లు వినియోగం అయ్యింది. రాష్ట్ర విభజన అనంతరం విద్యుత్ కి ఇంత డిమాండ్ రావటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ఏడాది మార్చ్ లో అత్యధికంగా రోజుకు 220 మిలియన్ యూనిట్లకు వెళ్లే అవకాశం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి లేదా విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కొనుగోలు చేయని పక్షంలో ఇక విద్యుత్ కోతలు తప్పని సరి. కోతలు తప్పని పరిస్థితి ఎదురైతే రాబోయే వేసవికాలంలో ఉక్కపోతతో రాష్ట్రం అల్లాడి పోవాల్సిందే. సో ఈ పరిస్థితి రాకూడదంటే ప్రజలు విద్యుత్ వినియోగంపై జాగ్రత్తలు పాటించాలని..ఇంధనాన్ని పొదుపుగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.