- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో కానిస్టేబుల్ సస్పెన్షన్..కారణం అదేనా
దిశ, నిజామాబాద్ :
కామారెడ్డి జిల్లాలో సస్పెన్షన్‌కు గురైన కానిస్టేబుళ్ల సంఖ్య ఆరుకు చేరింది. వీరంతా అక్రమ ఇసుక రవాణా కేసులో సంబంధం ఉన్నవారే అని తేలింది. కామారెడ్డిలో ఈ మధ్య కాలంలో అక్రమ ఇసుక దందా జోరుగా నడుస్తోంది.దీనికి పోలీసులు దగ్గరుండి సాయం చేస్తున్నారనే ఆరోపణలు వెలువడటంతో జిల్లా ఎస్పీ శ్వేత విచారణకు ఆదేశించారు.రిపోర్టులో కానిస్టేబుళ్ల హస్తం ఉందని తేలడంతో వారిపై వేటు వేశారు.వివరాల్లోకివెళితే..కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం తూజాల్ పూర్ వాగు నుంచి కొందరు ఇసుక ఆక్రమ రవాణా చేస్తున్నారు.విషయం తెలుసుకున్న బీబీపేట హెడ్ కానిస్టేబుల్ యూసుఫ్, మరో హోంగార్డ్ అక్రమార్కులను అడ్డుకోవాల్సింది పోయి వారితో కుమ్మక్కయ్యారు.ఈ విషయంపై విచారణ జరిపి హెడ్ కానిస్టేబుల్‌పై వేటు వేయగా, హోంగార్డ్‌కు మెమో జారీ చేసినట్టు జిల్లా ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. కాగా, ఇప్పటి వరకు ఐదుగురు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోగా తాజాగా మరో కానిస్టేబుల్‌పై వేటు పడింది.