- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్‌స్పెక్టర్‌కు నమస్తే పెట్టలేదని కానిస్టేబుల్ ఓవరాక్షన్.. యువకుడిని చితకబాది!
దిశ, చార్మినార్ : సార్‌కు సెల్యూట్ చేయలేదన్న నెపంతో ఓ వ్యక్తిపై చేయి చేసుకున్న ఫలక్‌నుమా కానిస్టేబుల్ పై వేటుపడింది. బాధితుని కథనం ప్రకారం.. ఫలక్‌నుమా మదీనా కాలనీకి చెందిన సయ్యద్ హుస్సేన్ అతని స్నేహితుడు ఫలక్ నుమా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అక్కడ పోలీస్ స్టేషన్ బయట పార్కింగ్‌లో బైక్ పై సయ్యద్ హుస్సేన్ కూర్చుని ఉండగా అతని స్నేహితుడు పోలీస్ స్టేషన్‌లోకి వెళ్ళాడు. ఇంతలోనే ఇన్ స్పెక్టర్ పోలీస్ స్టేషన్ బయటికి వచ్చి పెట్రోలింగ్ వాహనంలో వెళ్ళిపోయాడు.
ఇదంతా గమనించిన భరత్ అనే కానిస్టేబుల్ సార్ వస్తుంటే బైక్ మీద నుంచి లేవకుండా.. కనీసం ఎందుకు సెల్యూట్ పెట్టలేదని సయ్యద్ హుస్సేన్‌తో వాగ్వివాదం చోటుచేసుకుంది. అంతటితో ఆగకుండా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి దాడి చేశాడు. బాధితుడు యాకుత్ పురా ఎమ్మెల్యే పాషా ఖాద్రీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. దీంతో ఎమ్మెల్యే ఖాద్రీ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ కానిస్టేబుల్ భరత్‌ను హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.