దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపు ఖాయం

by Shyam |
దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపు ఖాయం
X

దిశ, సిద్దిపేట: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి గంప మహేందర్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ వర్మ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వి.హనుమంతరావు మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మర్చారని వీహెచ్ ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ పేరుతో పేదల డబ్బును రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటోందని వీహెచ్ మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కుడా సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు.

Advertisement

Next Story