తెలంగాణను చావుల రాష్ట్రంగా మార్చారు.. కేసీఆర్‌పై మధుయాష్కీ‌ ఫైర్

by Ramesh Goud |
తెలంగాణను చావుల రాష్ట్రంగా మార్చారు.. కేసీఆర్‌పై మధుయాష్కీ‌ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ చావుల రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. కాంటాలు జరగడం లేదని 206 మంది రైతులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఆడుతున్న జూదంలో రైతులు బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది దాదాపు వెయ్యి మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని, రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో మధుయాష్కీ తెలిపారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఏడేళ్లు గడుస్తు్న్నా రైతుల రుణాలు మాఫీ చేయలేదని, 36,44 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ధరణిలో లోపాలు, భూ సంస్కరణల పేరుతో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన విధానాలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు వెంటనే రూ.10 లక్షలు ఆర్థికసాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా, రైతుల కుటుంబంలో అర్హత కలిగిన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన కోరారు.

Advertisement

Next Story