- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కాంగ్రెస్‌కు శస్త్ర చికిత్స అవసరం.. వీరప్ప మొయిలీ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ.. కాంగ్రెస్ పార్టీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ బాగుపడాలంటే పార్టీకి శస్త్రచికిత్స అవసరమని పేర్కొన్నారు. మాజీ మంత్రి జితిన్ ప్రసాద బీజేపీలో చేరిన నేపథ్యంలో వీరప్ప మొయిలీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీతత్వాన్ని అలవరుచుకోవాలని అన్నారు. పార్టీ పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తులనే అధిష్ఠానం ప్రోత్సహించాలని తెలిపారు.
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సరైన ప్రదర్శన ఇవ్వకపోతే.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. సరైన స్థానాల్లో తగిన వ్యక్తుల్ని నియమించి పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలని అధిష్టానాన్ని కోరారు. అసమర్థులైన వ్యక్తులను కీలక స్థానాల్లో కూర్చోబెట్టకూడదని హితవు పలికారు. ఇప్పటి వరకు చోటుచేసుకున్న పరిస్థితులను ఓ గుణపాఠంగా తీసుకుని.. పార్టీలో ఉన్న లోటుపాట్లను పునరాలోచించుకుని సరైన వ్యూహాన్ని అమలు చేస్తేనే కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.