- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vishwak Sen: చేతిలో డబ్బులు లేకపోయిన ఆ హీరోయిన్ కోసం అంత దూరం వెళ్లా.. విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky). కమర్షియల్ ఎంటర్‌టైన్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి (Ram Talluri) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. రవితేజ ముళ్లపూడి (RaviTeja Mullapudi) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), శ్రద్ధా శ్రీనాథ్ (Sraddha Srinath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మెకానిక్ రాకీ’ నవంబర్ (November) 22న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. విడుదల సమయం దగ్గరపడటంతో వరుస ప్రమోషన్స్ (Promotions) తో సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ (Interview)లో పాల్గొన్న విశ్వక్.. సినిమా విషయాలు పంచుకోవడంతో పాటు శ్రద్ధా శ్రీనాథ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (Interesting comments) చేశాడు.
‘‘మెకానిక్ రాకీ’లో నా పాత్ర ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇందులో నేను లోకల్ బాయ్‌గా కనిపిస్తా. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గురించి మీకో విషయం చెప్పాలి. ‘ఫలక్‌నుమా దాస్’ (Falaknuma Das) సినిమా చేస్తున్నప్పుడు అందులో హీరోయిన్‌గా మెదట శ్రద్ధా శ్రీనాథ్‌నే తీసుకోవాలి అనుకున్నాము. బెంగుళూరు (Bangalore) వెళ్లి ఆమెను కలిసి కథ కూడా చెప్పాను. కాకపోతే శ్రద్ధా నో చెప్పింది. ఆ టైంలో చేతులో డబ్బులు కూడా లేనప్పటికీ ఖర్చు పెట్టుకొని బెంగుళూరుకు వెళ్తే.. అనుకున్నది జరగలేదని చాలా బాధపడ్డా. ఇప్పుడు శ్రద్ధా శ్రీనాథ్ నా సినిమాలో యాక్ట్ చెయ్యడం సంతోషంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.