CPI Ramakrishna: సీఎం చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ

by Rani Yarlagadda |
CPI Ramakrishna: సీఎం చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి (Chandrababu Naidu) సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) లేఖ రాశారు. రాష్ట్రంలో అత్యున్నత ప్రాధాన్యమివ్వాల్సిన రంగం విద్యారంగమని, వెంటనే ఉన్న విద్యామండలి ఛైర్మన్, యూనివర్సిటీలకు ఉపకులపతుల్ని నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న 18 యూనివర్సిటీల్లో 101 విభాగాల్లో 418 ప్రొఫెసర్ పోస్టులు, 801 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 3220 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు 2023లో నోటిఫికేషన్ విడుదల చేశారు కానీ.. ఆయా పోస్టుల్ని భర్తీ చేయడంలో గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని లేఖలో పేర్కొన్నారు. భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చిన 4439 యూనివర్సిటీ పోస్టుల్ని వెంటనే భర్తీ చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story